కాంగ్రెసోళ్లకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దు
-కాంగ్రెస్ అడ్డగోలు విధానాల వల్లే దేశం వెనుకబడింది
కాంగ్రెసోళ్లకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దు
-కాంగ్రెస్ అడ్డగోలు విధానాల వల్లే దేశం వెనుకబడింది
– సీఎం కేసీఆర్
టీ మీడియా, నవంబర్ 7, మంథని : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు కాదు.. డిపాజిట్లు కూడా రావొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంట్ తీసేస్తే.. రైతులు ఆగమైతపోతారని, రైతులు ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ ఎవరి కోసం తెచ్చామో ఆలోచించాలి. గతంలో రైతుల భూములను ఇష్టమొచ్చినట్లు రాశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. పైసలు మింగి నాశనం చేశారు. వారి భూముల మీద హక్కులు వారికే ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చాం. రైతుబంధు డ్బబులు వేయగానే మీ సెల్‌ఫోన్ టింగ్ టింగ్‌మని మోగుతుంది. అప్పులు తీరిపోతున్నాయి. పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గొడ్డలి భుజం మీద పెట్టుకుని బయల్దేరింది జాగ్రత్తా.. ఇంతుకు ముందు రైతు భర్తలు వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ రెవెన్యూ సెక్రటరీ సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి.. వీరిలో ఏ ఒక్కరికి కోపం వచ్చిన రైతు భూమి ఖతం అయ్యేది. ఇవన్నీ ఆలోచించి రైతుకే అధికారం ఇచ్చాం. మీ బొటనవేలి మీ భూమిని మారుస్తుంది.
Also Read : 9న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నామినేషన్
రైతు భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. గవర్నమెంట్ తన వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారపోసింది. ఈ అధికారాన్ని రైతులు ఉంచుకుంటారా.. పొగొట్టుకుంటారా..? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో వేస్తారట. మరి ఏమైతది.. అందుకే ఆలోచించి ఓటేయాలి. ధరణి తీసేస్తే.. మళ్లా దళారుల రాజ్యమే వస్తది. ఇవాళ దళారీ, దరఖాస్తు లేదు. ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. మరి దీన్ని ఉంచుకుందామా.. ఊడగొట్టుకుందామా..? ఆలోచించాలి అని కేసీఆర్ రైతులకు సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలన ప్రధానంగా ఆయన తప్పుపట్టారు. ‘దేశంలో రైతుల గురించి గానీ, దళిత బిడ్డల గురించి గానీ, గిరిజన ఆదివాసీల గురించి గానీ కాంగ్రెస్ పార్టీ సరైన పద్ధతిలో ముందుకు వెళ్తే ఇవాళ దేశం ఇట్ల ఎందుకుంటుండె..?
Also Read : ఉత్తమ్ దంపతుల గెలుపు కోసం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు.
ఈ పరిస్థితులు ఎందుకు ఉంటుండె..? ఇది మీరొకసారి ఆలోచించాలె. మన కంటే వెనుకకు స్వాతంత్య్రం వచ్చిన చైనా కూడా ఎంతో ముందుకు దూసుకుపోయి అమెరికాతో పోటీ పడుతున్నది. మరె మనకు ఈ గతి ఎందుకు..? ఇవి ఆలోచించకుండా గుడ్డిగ ఓటేస్తే మంచి ఫలితం రాదు. దెబ్బతింటం. అందుకే ఆలోచించకుండా, బాధ్యత లేకుండా ఓటు వేయొద్దని నేను కోరుతున్నా’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube