పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ

పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ

1
TMedia (Telugu News) :

పాఠశాలలో నోట్ పుస్తకాల పంపిణీ

టీ మీడియా, జూన్ 22, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ మిత్రుడు బిలకంటి ఉదయ్ కుమార్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్లకంటి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ చక్కగా ఉపయోగించుకొని పిల్లలు మంచిగా క్రమశిక్షణతో పై చదువులు చదివి మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మేకల రవి కుమార్ యాదవ్, బిలకంటి ఉదయ్ కుమార్ ను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

Also Read : ముర్ముకు జెడ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త

అనంతరం తెలంగాణ గ్రామీణ క్రీడామైదానం పనులను పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఈసీ నరసింహారెడ్డి, 505 సర్వేనెంబర్ 2-17 కుంటల భూమిలో జరుగుతున్న క్రీడా మైదాన ప్రాంతాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఈసీ నరసింహారెడ్డి, శివ, పంచాయతీ కార్యదర్శి శేఖర్ రెడ్డి, తోమాలపల్లి మధు, ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, వార్డు సభ్యులు కృష్ణ నాయుడు, ఎస్ఎంసి చైర్మన్ పరమేశ్వరమ్మ, సిఆర్పి రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube