విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
టీ మీడియా, జూన్30, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ ఠాగూర్ స్టేడియం పరిధిలోని రెండు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లోని విద్యార్థులకు ముఖ్య అతిథిగ వచ్చిన కట్కూరి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవెల్లి రాజేష్ గారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల స్కూల్స్ తెరవలేదు కాబట్టి పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు.
Also Read : చెక్ పోస్టులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
ఈసారి తప్పకుండా పుస్తకాల పంపిణీ చేయాలని దాతల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది ఎంతోమంది దాతలు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ వెంగల్ దాస్ సంతోష్ గారు ముందుకు వచ్చి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటితో విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ కొనుగోలు చేసి సుమారు 60 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షుడు ఎర్రవెల్లి రాజేష్, ఎం డి పాషా, తుంగ పిండి ప్రవీణ్ ,శ్రీకాంత్ ,కర్ణాకర్ ,స్కూల్ టీచర్స్ పాల్గొనడం జరిగింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube