నోటుపుస్తకాల పంపిణీ

నోటుపుస్తకాల పంపిణీ

1
TMedia (Telugu News) :

నోటుపుస్తకాల పంపిణీ
టీ మీడియా, జూన్ 23,జగిత్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలంలోని రామకిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల యందు విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ సమన్వయకర్తకె. విజయ ఆధ్వర్యంలో6, 7 వ తరగతి విద్యార్థులకు పదివేల విలువైన నోటు పుస్తకాలు, కంపాస్ బాక్సులనుగురువారం పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా విజయ మేడం మాట్లాడుతూ.పిల్లలకు రాతపుస్తకాలు అందించడం ఒక సామాజిక బాధ్యత గా భావించి పంపిణీ చేశామని తెలిపారు..

Also Read : క్రీడలకు అన్ని విధాలుగా ప్రోత్సాహం

విద్యార్థులు బాగా చదివి గ్రామానికి పాఠశాలకు పేరు తీసుకురావాలన్నారు… ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. కృష్ణంరాజు, ఎస్ఎంసి చైర్మన్జి. తిరుపతి, గ్రామ సర్పంచ్ శ్రీ లక్ష్మీ దేవి ,గ్రామ ఉపసర్పంచ్ పులి మనోహర్, ఎస్ఎంసి వైస్ చైర్మన్ డి మరియ, ఉపాధ్యాయులు ఎండి ఫహీం, రామ్ ప్రసాద్, అఫ్రోజ్ ఖాన్ , జి స్వప్న, టి. రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పాఠశాల తరఫున పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణంరాజు గ్లోబల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube