తాజ్‌మ‌హ‌ల్‌కు నోటీసులు.

నీటి బిల్లు, ఆస్తి ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశాలు

1
TMedia (Telugu News) :

తాజ్‌మ‌హ‌ల్‌కు నోటీసులు..

-నీటి బిల్లు, ఆస్తి ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశాలు

టీ మీడియా, డిసెంబర్ 20, న్యూఢిల్లీ : 370 ఏండ్ల చ‌రిత్ర ఉన్న తాజ్‌మ‌హ‌ల్‌కు తొలిసారిగా నీటి బిల్లు, ఆస్తి ప‌న్ను చెల్లించాల‌ని నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం రూ. కోటి చెల్లించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసిన‌ట్లు ఆర్కియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. తాజ్‌మ‌హ‌ల్‌కు రెండు నోటీసులు, ఆగ్రా ఫోర్ట్‌కు ఒక నోటీసు అందిన‌ట్లు ఏఎస్ఐ అధికారి రాజ్ కుమార్ ప‌టేల్ వెల్ల‌డించారు. అయితే స్మారక కట్టడాలకు పన్నులు వర్తించవు అని రాజ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. నోటీసులు పొర‌పాటున జారీ అయి ఉండొచ్చ‌ని పేర్కొన్నారు. తాజ్‌మ‌హ‌ల్‌కు ఆస్తి ప‌న్ను వ‌ర్తించ‌ద‌న్నారు. ఈ నిబంధ‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ చ‌ట్టాల్లో ఉంద‌ని గుర్తు చేశారు. నీటిని ఎలాంటి వాణిజ్య ప్ర‌యోజ‌నాల కోసం వాడ‌టం లేద‌న్నారు.

Also Read : కంటెయినర్‌ను ఢీకొన్న బస్సు

కేవ‌లం తాజ్ మ‌హ‌ల్‌లోని లాన్ల కోస‌మే వినియోగిస్తున్నామ‌ని, దీనికి ఎలాంటి బిల్లు జారీ కాదని స్ప‌ష్టం చేశారు. ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద అయిన తాజ‌మ‌హ‌ల్‌, ఆగ్రా ఫోర్ట్‌కు కంటోన్మెంట్ బోర్డు త‌మ‌కు నోటీసు ఇచ్చింద‌న్నారు. రూ. 5 కోట్ల‌కు పైగా చెల్లించాల‌ని నోటీసులు జారీ అయ్యాయ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చ‌ట్టం ప్ర‌కారం, స్మార‌క చిహ్నాల‌కు నీటిబిల్లు, ఆస్తి ప‌న్ను మిన‌హాయించిన విష‌యాన్ని బోర్డుకు గుర్తు చేశామ‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube