లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

1
TMedia (Telugu News) :

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

టీ మీడియా,నవంబర్ 5, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతితో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానంతోపాటు ఒడిశాలోని పదంపూర్‌, రాజస్థాన్‌లోని సర్దార్‌ షహర్‌, బీహార్‌లోని కుర్హనీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌, యూపీలోని రామ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 10న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతుందని పేర్కొన్నది.

Also Read : ప్రధాని పర్యటన కు కేసీఆర్ దూరమైనా..

అదేరోజున నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, నవంబర్‌ 17న నామపత్రాల దాఖలుకు చివరి రోజని తెలిపింది. డిసెంబర్‌ 5న ఈ ఆరు స్థానాల్లో పోలింగ్‌ నిర్వహిస్తామని, అదే నెల 8న ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube