తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

1
TMedia (Telugu News) :

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
టి మీడియా,జులై7,హైద్రాబాద్:
తెలంగాణ హైకోర్టులో 65 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. జ‌డ్జిలు, రిజిస్ట్రార్ల ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీలు, కోర్టు మాస్ట‌ర్ల పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద ఉద్యోగులు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. దేశంలోని ఏ యూనివ‌ర్సిటీ నుంచైనా డిగ్రీ లేదా లా విద్య‌ను అభ్య‌సించిన వారంద‌రూ ఈ పోస్టుల‌కు దరఖాస్తులు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ద‌ర‌ఖాస్తుదారుల‌కు 2022, జులై 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలని, 34 ఏండ్ల వ‌య‌సు మించ‌రాదు అని పేర్కొన్నారు.

 

Also Read : ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ వర్ధంతి వేడుకలు

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరికి చెందిన అభ్య‌ర్థుల‌కు వ‌యో ప‌రిమితి సడలింపు ఇచ్చారు. ఓసీ, బీసీ కేట‌గిరిల వారు రూ. 800 చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరి అభ్య‌ర్థులు రూ. 400 చెల్లించాలి. డీడీల‌ను ది రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట తీయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను స్పీడ్ పోస్టు లేదా కొరియ‌ర్ ద్వారా జులై 22న సాయంత్రం 5 గంట‌ల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలి._

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube