పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

1
TMedia (Telugu News) :

పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
టీ మీడియా, ఎప్రిల్ 01,హైద‌రాబాద్ :రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన పీజీ యాజమాన్య కోటా సీట్లను మాప్ అప్ నోటిఫికేషన్‌ ‌ ద్వారా భర్తీ చేయనున్నారు. యాజమాన్య కోటకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయింత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా.. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Also Read : తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube