ఎన్ఆర్ఈజీఎస్ వేతనం 257పడేలా పనిచేయాలి

ఎన్ఆర్ఈజీఎస్ వేతనం 257పడేలా పనిచేయాలి

1
TMedia (Telugu News) :

ఎన్ఆర్ఈజీఎస్ వేతనం 257పడేలా పనిచేయాలి
టీ మీడియా,ఏప్రిల్ 23,ఎర్రుపాలెం:ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు కనీసం వేతనం రూ 257 పడేలా చర్యలు చేపట్టాలని డిఆర్డిఎ ఎపిడి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని భీమవరం అయ్యవారిగూడెం చెరువులలో జరుగుతున్న పూడికతీత పనులు లను ఆయన శుక్రవారం పరిశీలించి ఆయా చెరువులలో జరుగుతున్న పూడిక తీత పనుల్లో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ కూలీలతో ఆయన మాట్లాడి మస్టర్ లు పరిశీలించి కనీస వేతనం పడేలా కూలీలు పని చేయాలని అవగాహన కల్పించారు. అనంతరం గుంటుపల్లి గోపవరం గ్రామపంచాయతీ నర్సరీలో తనిఖీ చేసి హరితహారం మొక్కలు 100% పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆ గ్రామ సెక్రెటరీ కోట హారతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసరావు, ఏపీవో నాగరాజు, టిఏ లక్ష్మయ్య ఆయా గ్రామ సర్పంచ్ లు గోసు రామారావు, కోట సుందరమ్మ, కోట శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

also read ; నాపై కుట్ర జరుగుతోంది: మంత్రి పువ్వాడ

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube