శిశుమందిర్ పాఠశాలను దత్తత తీసుకున్న ఎన్ అర్ ఐ
– అధ్యక్షులు పాకాల కృషి అభినందనీయం
టి మీడియా, మార్చి 4, భద్రాచలం : పట్టణం లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలను ప్రవాస భారతీయుడు, ఎస్ -2 టెక్ సి ఈ ఓ వీర్లపాటి దయాకర్ దత్తత తీసుకున్నారు. ముందుగా శనివారం రు.90 లక్షలు తో ఏర్పాటు చేసిన గ్రంధాలయం, ప్రయోగశాల, కంప్యూటర్ ల్యాబ్, పలు ఆట వస్తువులను ప్రారంభించారు. కాగా ఈ పాఠశాలను ప్రవాస భారతీయులు దత్తత తీసుకోవడం తో కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి రానుంది అని,ప్రముఖ ఐ టి సి కాంట్రాక్టర్ పాకాల దుర్గా ప్రసాద్ శిశు మందిర్ పాఠశాలకు అధ్యక్షులు గా ఈ విద్యాలయం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రవాస భారతీయులు దత్తత తీసుకోవడానికి పాకాల ప్రయత్నం ఫలించడంతో శిశు మందిర్ కు మంచి రోజులు రానున్నాయు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, గట్టు వెంకటాచారీ, గోళ్ళ భూపతి రావు, ఎస్ కే అజీమ్, అబ్రహం, ప్రిన్సిపాల్ గీత తదితరులు పాల్గొన్నారు.