టీ మీడీయా,డిసెంబర్9,కరకగూడెం;
పదో తరగతి చదువుకునే విద్యార్థులు కరెంట్ కట్టింగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సోలార్ లాంప్ ల పంపిణీ కార్యక్రమాన్ని కరకగూడెం లోని కేజీబీవీ బాలికల పాఠశాల నందు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు.
గిరిజన ప్రాంత విద్యార్థులు అనేక రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నత స్థానాన్ని చేరుకుంటున్న సందర్భంలో వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి డి.శ్రీదేవి తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్టడీ లాంప్ లను అందించినందుకు ఉపాధ్యాయులు,విద్యార్థినులు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊకే రామనాథం, ఉపసర్పంచ్ రావుల రవి, నోడల్ అధికారి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.