ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
ఎన్ ఆర్ ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
టి మీడియా,జూన్ 23,ఖమ్మం సిటీ:
ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుడా ఆఫీస్ నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఏంస్వరూపరాణి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు హాజరయ్యారు.సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ వారు చేస్తున్న సంఘ సేవా కార్యక్రమాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం కోకియా తండాకు చెందిన రాజకుమార్ వికలాంగుడు నడవలేడు ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉన్నాడు ఇతని ఆర్థిక పరిస్థితి బాగా లేనందున అతని భార్య రాధికకు సంఘం అధ్యక్షురాలు ఏం స్వరూప రాణి గారు పదివేల రూపాయలు సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారి ద్వారా అందజేశారు.
Also Read : యాత్రను విజయవంతం చేయాలి
అలాగే ఖమ్మం పరిధిలోని కై కొండాయి గూడెం గ్రామానికి చెందిన భావన ఉమారాణి బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నందున ఆమెకు కూడా పదివేల రూపాయలు అందజేయడం జరిగింది.ఈ సహాయాన్ని అందజేసిన ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏం స్వరూప రాణి గారిని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు అభినందించారు.పాఠశాల పౌండేషన్ సహారా మినిస్ట్రీస్ వారు ఈ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షురాలునీరజ,వైస్ ప్రెసిడెంట్ ఈమమత సభ్యులు కె రాములమ్మ,ఏం ప్రియ, సుజాత,మధురవాణి, శైలజ ,ఈ రమణ గారు,శ్రీనివాస రావు, బినాగేశ్వరరావు,టి శివన్నారాయణ, M పుల్లయ్య చౌదరి,K వీరనారాయణ గార్లు హాజరైనారు…
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube