ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

0
TMedia (Telugu News) :

ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

టీ మీడియా, జనవరి 13, వనపర్తి బ్యూరో : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి ఎన్టీఆర్ వర్ధంతి 18 తేదీన ఘనంగా నిర్వహించాలని నాయకులు బి.రాములు,వెంకటయ్య యాదవ్,నందిమల్ల.అశోక్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదముతో సంక్షేమ పథకాలు 2 /- రూపాయలకు కిలోబియ్యం, వృద్దాప్య పింఛన్లు, మహిళలలకు ఆస్తిలో సమాన హక్కు,రైతులకు ఉచిత కరెంటు, జనతా వస్త్రాలు,పక్కా గృహాలు, మండల వ్యవస్థ తదితర పథకాలు చేపట్టిన మహనీయుడు ఎన్టిఆర్ అన్నారు.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసరం ఉందని అన్నారు.

Also Read : ట్రస్ట్ కు తన మరణాంతరం అవయవదానం

కార్యకర్తలు ,నాయకులు కసితో పనిచేసి పార్టీ అభివృద్ధికి తొడుపడాలని అన్నారు.ఈ సమావేశంలో నందిమల్ల. రమేష్, ఆవుల.శ్రీను,చిన్నయ్య యాదవ్,చిట్యాల.బాలరాజు,డి.బాలరాజు,బాలు నాయుడు, ఖాదర్,కొత్త.గొల్ల.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube