ఒడిశా లోబొగ్గు ఉత్ప‌త్తి కి స‌న్నాహాలు

ఒడిశా లోబొగ్గు ఉత్ప‌త్తి కి స‌న్నాహాలు

1
TMedia (Telugu News) :

 

ఒడిశా  నైనీ బ్లాక్ నుంచి స‌కాలంలో బొగ్గు ఉత్ప‌త్తి కి స‌న్నాహాలు

-ఒడిశా ఉన్న‌తాధికారుల‌తో డైరెక్ట‌ర్‌(ఫైనాన్స్‌, పి అండ్ పి) శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ వ‌రుస స‌మావేశాలు

-బొగ్గు ర‌వాణా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

2022సింగ‌రేణి భ‌వ‌న్‌, అక్టోబ‌రు  

సింగ‌రేణి సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశాల మేర‌కు ఒడిశా రాష్ట్రంలో సింగ‌రేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్ప‌త్తి ప్రారంభించ‌డానికి సింగ‌రేణి ఉన్న‌తాధికారులు పెద్ద ఎత్తున స‌న్నాహాలు చేస్తున్నారు. సంస్థ డైరెక్ట‌ర్ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్‌) శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ గ‌త మూడు రోజులుగా ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ లో ఆ రాష్ట్ర అట‌వీ, వ‌న్య ప్రాణి సంరక్ష‌ణ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను, అంగూల్ జిల్లా క‌లెక్ట‌ర్ ను, ఇత‌ర అధికారుల‌ను క‌లిసి ప్రాజెక్టు ప్రారంభానికి స‌హ‌కారం అందించాల‌ని కోరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌తో పాటు అడ్వైజ‌ర్ (ఫారెస్ట్రీ) శ్రీ సురేంద్ర పాండే , జీఎం(నైనీ) శ్రీ సురేశ్ ఉన్నారు.

 

also read :రాహుల్ పాదయాత్ర ను విజయవంతం చేయండి

నైనీ బొగ్గు బ్లాక్ కు కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ నుంచి స్టేజ్ -2 అనుమ‌తులు ల‌భించిన నేప‌థ్యంలో దీని అమ‌లుకు త‌క్ష‌ణ ఆదేశాలు జారీ చేయాల‌ని , ఉత్ప‌త్తి ప్ర‌క్రియ ప్రారంభించేందుకు మార్గం సుగ‌మం చేయాల‌ని ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌న్స‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్ర్ శ్రీ బిశ్వాల్, ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌న్స‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్ర్ (వ‌న్య ప్రాణి) శ్రీ పొప్లి, అంగూల్ క‌లెక్ట‌ర్ శ్రీ సిద్ధార్థ్ శంక‌ర్ స్వేన్ ను శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ కోరారు. దీనిపై ఉన్న‌తాధికారులు సానుకూలంగా స్పందిస్తూ నైనీ లో బొగ్గు ఉత్ప‌త్తికి త‌మ పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

 

also read :పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

కాగా, ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఒడిశా ప్ర‌భుత్వం నిర్వ‌హించిన పెట్టు బ‌డుల ఆక‌ర్ష‌ణ స‌ద‌స్సు సంద‌ర్భంగా కూడా సంస్థ డైరెక్ట‌ర్లు శ్రీ ఎస్‌.చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ ఆ రాష్ట్ర ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ సురేశ్ చంద్ర మ‌హాపాత్ర‌ ని, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి నైనీ బొగ్గు బ్లాక్ లో బొగ్గు ఉత్ప‌త్తి ప్ర‌క్రియ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుపుతూ స‌హ‌కారం అందించాల‌ని కోర‌గా.. వారు సానుకూలంగా స్పందించారు.

also ReaD : పోలవరం పై రాహుల్ గాంధీతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు

 

ఒడిశా ప‌ర్య‌ట‌న‌లో డైరెక్ట‌ర్ శ్రీ ఎన్.బ‌ల‌రామ్ గురువారం నైనీ బొగ్గు బ్లాక్ ప్ర‌దేశాన్ని అక్క‌డ జ‌రుగుతున్న గ‌ని ప్రారంభం స‌న్నాహాల‌ను సింగ‌రేణి అధికారుల‌తో స‌మీక్షించారు. మ‌రో రెండు నెల‌ల్లో బొగ్గు ఉత్ప‌త్తి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ బొగ్గు ను స‌మీపంలో గ‌ల రైల్వే సైడింగ్ ల‌కు రోడ్డు మార్గం ద్వారా ప్ర‌స్తుతానికి ర‌వాణా చేయ‌డంపై కూడా ఆయ‌న కూలంక‌శంగా చ‌ర్చించారు. నైనీ బ్లాక్ కు 28 కిలో మీట‌ర్ల దూరంలో గ‌ల జ‌ర‌ప‌డ రైల్వే సైడింగ్ ను , 52 కిలో మీట‌ర్ల దూరంలో గ‌ల హండ‌ప్ప సైడింగ్ ను స్వ‌యంగా ప‌రిశీలించి రైల్వే అధికారుల‌తో కూడా చ‌ర్చించారు. అతి త్వ‌ర‌లో నైనీ నుంచి బొగ్గు ఉత్ప‌త్తి ప్రారంభం కాబోతుంద‌ని దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు శ్రీ ఎన్‌.బ‌ల‌రామ్ వెల్ల‌డించారు. ప్రాజెక్టు ఆఫీస‌ర్ శ్రీ ర‌వీంద్ర పి. చౌద‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube