మహానందీశ్వరునికి 101 కొబ్బరికాయల సమర్పణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 23, మహానంది:

మహానంది మండల కేంద్రమైన యం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బశిరెడ్డి బాగభూపాల్ రెడ్డికి రాష్ట్ర గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గా పదవిరావడం, 24న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పుట్టుపల్లె గ్రామంలోని చిక్యాల వెంకటేశ్వర్లు, జయమ్మ, కుమారుడు బాలకుమార్ లు మహానందిశ్వరునికి నూట ఒక్కటి కొబ్బరికాయలు సమర్పించారు.
వారు మాట్లాడుతూ ఎంపీపీ స్థాయినుంచి స్టేట్ పదవి వరకు ఎదగడం అభినందనియమన్నారు.
ఇంకా మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

offering of 101 coconuts to mahanandiswara.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube