టీ మీడియా నవంబర్ 2 మహానంది
మహానంది మండలంలోని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలను మంగళవారం కర్నూలు జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు జెడిఎ వరలక్ష్మి మరియు వ్యవసాయ సంచాలకులు శ్రీ రాజశేఖర్ ఎడిఎ వారు సీతారాంపురం, నందిపల్లి,బుక్కాపురం, గ్రామాల్లో సందర్శించి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి మరియు సిబ్బంది తో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆర్ బి కె వారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో సుమారు ఆరు గ్రామాల గ్రామ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు పంట నష్టం నివేదికలు ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
