పోరాటాలకు స్పందించిన అధికారులు

పోరాటాలకు స్పందించిన అధికారులు

1
TMedia (Telugu News) :

పోరాటాలకు స్పందించిన అధికారులు

టీ మీడియా, మే 5, వనపర్తి బ్యూరో : గత కొన్ని నెలలుగా అఖిలపక్ష ఐక్యవేదిక ఐక్యవేదిక సభ్యులు వనపర్తి నుండి బస్సులు దొంగచాటుగా తరలిస్తున్నారని పోరాటం చేసి గత శుక్రవారం నాడు దీక్ష చేయగా స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆర్ఎంను వనపర్తికి పిలిపించుకుని బస్సుల విషయం మాట్లాడితే తక్షణమే ఐదు బస్సులు తెప్పించినట్లు సమాచారం 3 ఎక్స్ప్రెస్ బస్సులు,, రెండు డీలక్స్ బస్సులు 0067,0329,0019,0148 కర్నూల్ నుంచి 0285 జగిత్యాల నుండి వచ్చాయి. ఈ విషయమే బస్సులు వాపస్ తెప్పించిన వారికి ఐక్య వేదిక సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ పోయిన ఐదు బస్సులు కాదు చాలా బస్సులు ఉన్నాయి.

Also Read : బీఎస్‌ఎఫ్‌ జవాన్‌, మార్షల్స్‌తో ఎంపీకి పటిష్ట

దాంట్లో ముఖ్యంగా సూపర్ లగ్జరీలు రాజధాని డీలక్స్ కొన్ని కొత్త ఎక్స్ప్రెస్లు వెళ్ళాయి వాటిని కూడా తెప్పించి ప్రజల కోరికను మన్నించి వనపర్తి డిపోకు పూర్వ వైభవం తేవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి ఆర్ ఎం శ్రీధర్ కి వనపర్తి డి ఎం కి అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అధికారులు ఐదు బస్సులు తెప్పించిన యెడల మన వనపర్తి ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని సందర్భంగా అఖిలపక్ష సభ్యులు కోరారు. ఈ సందర్భంగా అఖిలపక్ష అధికారులు డిపోలో సందర్శించి బస్సులను పరిశీలించారు. పరిశీలించిన వారిలో మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి, టీజేఎస్ ప్రధాన కార్యదర్శి షఫీ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్, చింతకుంట బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube