విదేశీయుల్ని తాక‌కండి.. చైనా అధికారుల‌ వార్నింగ్

విదేశీయుల్ని తాక‌కండి.. చైనా అధికారుల‌ వార్నింగ్

1
TMedia (Telugu News) :

విదేశీయుల్ని తాక‌కండి.. చైనా అధికారుల‌ వార్నింగ్

టీ మీడియా,సెప్టెంబర్ 19, బీజింగ్‌: విదేశీయుల్ని ఎవ‌రూ తాక‌వ‌ద్దు అని చైనా అధికారులు దేశ‌స్థుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవ‌ల చైనాలో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆరోగ్య అధికారులు ఆ హెచ్చ‌రిక చేసిన‌ట్లు తెలుస్తోంది. చైనా అంటువ్యాధుల నివార‌ణ సంస్థ(సీడీసీ) చీఫ్ ఎపిడ‌మ‌యాల‌జిస్ట్ వూ జున్యూ త‌న వీబోలో ఓ పోస్టు చేశారు. విదేశీయుల‌ను స్కిన్ టు స్కిన్ తాక‌వ‌ద్దు అని త‌న పోస్టులో ఆయ‌న తెలిపారు. అయితే ఆ పోస్టుపై వివాదం చెల‌రేగింది. జాత్యాహంకార‌ కామెంట్‌లా ఉంద‌ని కొంద‌రు ఆరోపించారు. దీంతో వీబో ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఆ కామెంట్ల‌ను తొల‌గించారు.

Also Read : వివాహిత గొంతు కోసిన యువకుడు

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానం కొన‌సాగించేందుకు, మంకీపాక్స్ వ్యాధి సోక‌కుండా ఉండేందుకు, విదేశీయుల‌ను నేరుగా తాక‌రాదు అని వూ జున్యూ త‌న వీబో పోస్టులో ప్ర‌జ‌ల్ని కోరారు. అంతేకాదు ఇటీవ‌ల విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారిని కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కావొద్దు అని ఆయ‌న తెలిపారు. చాంగ్‌కింగ్‌లో తొలి మంకీపాక్స్ కేసు న‌మోదు అయిన నేప‌థ్యంలో సీడీసీ చీఫ్ ఈ కామెంట్ చేశారు. అయితే వూ జున్యూ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దీంతొ ఆ వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube