అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి

అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి

0
TMedia (Telugu News) :

అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి

– స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

టీ మీడియా, డిసెంబర్ 27, వికారాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమంపై శాసనసభ సభాపతి వికారాబాద్‌ నియోజకవర్గస్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారం రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డులలో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 5 పథకాలైన మహా లక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.

Also Read : మంథని కి బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు

ప్రజా పాలనకు దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరిస్తూ దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా అధికారులు పనిచేయాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, లింగ్యా నాయక్‌, ఆర్డీవో విజయ కుమారి, డీఎస్పీ నర్సింలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల‌, తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube