రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్డరిచ్చిన భారత్

రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్డరిచ్చిన భారత్

1
TMedia (Telugu News) :

రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆర్డరిచ్చిన భారత్
టీ మీడియా, మార్చ్ 29న్యూఢిల్లీ :భారత్‌లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌నుఆర్డర్ఇచ్చినట్లుతెలుస్తోంది.ఈషిప్‌మెంట్ఏప్రిల్నెలలోభారత్‌కుచేరుతుంది.ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెలు దిగుమతి చేసుకునే భారత్‌.. కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మలేషియా, ఇండోనేషియా దేశాలు పామాయిల్, సోయా ఆయిల్ ఎగుమతులు తగ్గించేయడంతో భారత మార్కెట్లు దెబ్బతిన్నాయి. వీటికితోడు రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు కూడా రావడం లేదు.భారత్‌కు అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాలు రష్యా, ఉక్రెయినే. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి దిగుమతులు ఆగిపోవడంతో.. రష్యా వైపు భారత్ చూస్తోందని జెమిని ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు.

Also Read : శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈ కంపెనీ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసింది.ప్రస్తుతం టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను 2,150 డాలర్లకు భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది రికార్డు ధర. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు ఈ ధర కేవలం 1,630 డాలర్లుగానే ఉండేదని సమాచారం. గత నెల రోజులుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కుదరలేదని, కానీ ఇప్పుడు దిగుమతులకు కూడా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)లు లభిస్తున్న తరుణంలో మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లు ప్రారంభించారని దిగుమతి వ్యాపారులు వివరిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube