బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌.. నలుగురు మృతి

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌.. నలుగురు మృతి

1
TMedia (Telugu News) :

బ్రిడ్జిపై నుంచి నదిలో పడిన ఆయిల్‌ ట్యాంకర్‌.. నలుగురు మృతి

టి మీడియా,జూన్11,భువనేశ్వర్‌: ఒడియాలోని నయాగఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌.. పారదీప్‌ నుంచి నయాగఢ్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో నయాగఢ్‌ జిల్లాలోని ఇటామటి వద్ద ఉన్న పండుసురా వంతెన వద్ద నదిలో పడిపోయింది.ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కటక్‌ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

 

Also Read : డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube