27 సిద్దారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

27 సిద్దారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

1
TMedia (Telugu News) :

27 సిద్దారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

టి మీడియా, నవంబర్ 25,ఖమ్మం : నగరంలోని సిద్దారెడ్డి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించనున్నారు.కళాశాలలో 1980-90 మధ్య చదివిన విద్యార్థుల సమ్మేళనం పట్టణంలోని గొరిల్లా పార్క్ లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమం నిర్వహణకు గాను ప్రముఖ న్యాయవాది ఎం. నిరంజన్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండి . ఖమర్, ఏ పి టి ఎఫ్ రాష్ట్ర నేత వేణు ఇతర మిత్రులతో కలసి కమిటీగా ఏర్పాటుచేశారు.

Also Read : రెండవ రోజు అటవీశాఖ సిబ్బంది నిరసన

ఇప్పటికే ఈ కమిటీ పలుదఫాలుగా సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షిస్తన్నారు. ఆదివారం జరిగే సమ్మేళనంలో ముందుగా హాజరయ్యే పూర్వ విద్యార్థుల నమోదు కార్యక్రమం ఉంటుంది . ఆ తరువాత అద్యాపకులను, అప్పటి కార్యాలయ సిబ్బందిని సన్మానించనున్మారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు సందేశాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాధ్యమైనంత మందికి సమాచారం లు తెలిపారు.ఎవరికైనా సమాచారం అందనివారు ఈ ప్రకటననే ఆహ్వానంగా భావించి సమ్మేళనానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరంజన్ రెడ్డి, ఖమర్, వేణు ఒక ప్రకటనలో కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube