పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1
TMedia (Telugu News) :

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

టీ మీడియా, జూన్ 27, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో 1982 పదవ తరగతి జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం 40 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం ఘనంగా వారి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సమక్షంలో పూర్వ విద్యార్థుల అందరు కలిసి నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటలు పాటల కోలాటంలతో ఎంతో సరదాగా సందడిగా నిర్వహించారు.

Also Read : ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామానికి తొలిసారి కరెంట్

ఈ సందర్భంగా ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలుపుతూ వారి అనుభవాలను అందరి సమక్షంలో ఆనందగా పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల వనపర్తి ప్రధానోపాధ్యాయులు తారాబాయి, జిహెచ్ఎం సులోచన,ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు హేమలత, రేణుక, జ్యోతి, పద్మ, నివేదిత, భారతి, కమల, ప్రసన్న, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube