పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

1
TMedia (Telugu News) :

పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం
టీ మీడియా; ఏప్రిల్ 10, జగిత్యాల:మరణించిన స్నేహితుని తండ్రి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు పూర్వ విద్యార్థుల బృందం. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన పర్లపల్లి రాజలింగం యొక్క తండ్రి గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. కుటుంబం ఇంటి పెద్దను కోల్పోవడం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులను గుర్తించిన 2001-02 పదవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు స్నేహితుడి ని కలిసి పరామర్శించి వారికి రూ. 12, 500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సేవా భావాన్ని చాటుకుంటున్న 2001-02 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో కొత్తూరి మహేష్, నాగరాజు, రాకేష్, మల్లేశం, శ్రీనివాస్, రాజేందర్, చిరంజీవి తదితరులుపాల్గొన్నారు.

Also Read : హనుమాన్ ఆలయం పునర్నిర్మాణం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube