ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత

ప్ర‌తి గింజనూ కేంద్రం సేక‌రించాల్సిందే

1
TMedia (Telugu News) :

ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత
-ప్ర‌తి గింజనూ కేంద్రం సేక‌రించాల్సిందే
టీ మీడియా, ఏప్రిల్ 09, ఖమ్మం: తెలంగాణ రైతాంగం ఆరుగాలం క‌ష్టించి పండించే ధాన్యంపై కేంద్ర ప్ర‌భుత్వం చూపిస్తున్న ఉద్దేశ్య‌పూరిత నిర్ల‌క్ష్యానికి టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు ఖ‌మ్మంలో నెహ్రూన‌గ‌ర్‌లో గ‌ల త‌న ఇల్లు వ‌ర‌ల‌క్ష్మీ నిల‌యంపై న‌ల్ల‌జెండా ఎగుర‌వేసి నిర‌స‌న తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఇచ్చిన పిలుపు మేర‌కు ఈ జెండాను ఎగుర‌వేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం త‌ప్ప‌కుండా కొనాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

Also Read : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి

దేశవ్యాప్తంగా అన్న‌దాత‌లు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే తెలంగాణలోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తెలంగాణ రైతులు అదే మాదిరి కేంద్రంపై ‌ఉద్యమిస్తార‌ని ఎంపీ నామ కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఢిల్లీ వీదుల్లో ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకురావద్దని బీజేపీ ప్రభుత్వానికి సూచ‌న చేశారు. వాస్తవానికి 20 రోజుల పాటు ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా ఆందోళ‌న చేసినా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఎంపీ నామ మండిప‌డ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube