కెసిఆర్ ను మళ్లీ ఆశీర్వదించాలి

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

1
TMedia (Telugu News) :

కెసిఆర్ ను మళ్లీ ఆశీర్వదించాలి
-ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
టీ మీడియా,మార్చి20, మధిర:రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని లోక్ సభ పక్ష నేత ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర మండలంలో మధిర మడుపల్లి గ్రామాల్లో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రైతులందరూ ఒకచోట గుమిగూడి మాట్లాడుకునేందుకు మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రైతు బాగుండాలి రైతు రాజ్యం కోసమే రైతు బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ని మళ్లీ ఆశీర్వదించాలని ఆయన కోరారు. సంక్షేమ పథకాలు అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. నాకు మధిర అంటే ఎంతో ఇష్టం అని మధిర అభివృద్ధికి తప్పనిసరిగా నిధులు కేటాయిస్తానని ఆయన అన్నారు.

Also Read : ఉపాధి హామీ పనులపై సమీక్ష

కలిసికట్టుగా పనిచేసి ముందుకి కొనసాగుదామని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపిపి మెండెం లలిత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత వ్యవసాయ సహాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు,బొమ్మెర రామ్మూర్తి రంగిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube