నాడు పూలు..నేడు రాళ్లు

నాడు పూలు..నేడు రాళ్లు

0
TMedia (Telugu News) :

 

 

paper cuttingతెలంగాణ లోని బద్రాద్రి కొత్త గూడెం ఎమ్యెల్యే కొడుకు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.సుదీర్ఘ రాజకీయ చరిత్ర మంత్రి గా పని చేసిన వనామా వెంకటేశ్వరరావు గారికి ప్రస్తుతం కొడుకు వ్యవహారం ఇబ్బందిగా మారింది..రామకృష్ణ కుటుంబం అత్యంత బాధాకరం.ఆయన మరణానికి ముందు రికార్డు చేసిన వీడియో లోని అంశాలు అందరిని కలిచి వేశాయి.ఈ క్రమంలో పోలీస్ పై కొంతమందిఏదేదోమాట్లాడారు.మాట్లాడుతున్నారు.అదే పోలీస్ శాఖ వల్లనే సూసైడ్ నోట్, వీడియో బైటకు వచ్చిన విషయం మర్చి పోతున్నారు

AlsoRead:క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

ఆరోపణ కు గురి అయిన వ్యక్తిని,పోలీస్ ని ఘాట కట్టి మాట్లాడటం సరి కాదు.నిందితుల పై చర్య కోరడం తప్పు లేదు.ఇప్పుడే రాఘవ తప్పు చేసాడనే ఈ ప్రభుత్వ కాలం లోనే అన్న విధంగా వ్యవహారం సరికాదు.అట్లా అని నేను ఆర్ఎస్ కాదు.ఆ పార్టీ విధానాలు తో నాకు చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.రాఘన రాజకీయ వాన మాలు దిద్దు కొన్నది ఉమ్మడి రాష్ట్రంలో..ఆనాడే ఆయన తండ్రి వనామా వెంకటేశ్వరరావు గారు మంత్రి గా పని చేసారు.అప్పటి కేంద్రమంత్రి రేణుక చౌదరి గారికి ముఖ్యఅనుచరుడు గా ఎమ్మెల్యే వనామా ఉన్నారు. ఆకాలం లోనే ఆయన ప్రస్తుత నివాసం కట్టుబకొన్నారు.ఆ కాలం లోనే అడవిలో బొగ్గు బట్టీల తో పాటు,అక్రమ రిజిస్ట్రేషన్ లు ఆరోపణలు వనామా రాఘవ పై ఉన్నాయి. దందాలు ఆరోపణలు ఉన్నాయి. ఆనాడు నేను స్టాఫ్ రిపోర్టర్ గా ఉన్న వామపక్ష పత్రికలో రాసిన క్షేత్ర స్థాయి పరిశీలన కథనం ఉన్న పత్రిక ను అప్పుడు ఆయన రాజకీయ శత్రువులు 1500ల కాపీలు రి ప్రింట్ చేయించి పంచారు.అటు తరువాత ఆ పత్రిక యాజమాన్యం కొనసాగింపు కథనం ఆపేసింది.        ఆ నాడు నస్ కథనం కు సహకారం అందించి ఆధారాలు ఇచ్చిన బరిపాటి సీతారాములు గారు నేడు లేరు.ఆనాడే అక్రమము బైట పెడితే అప్పుడు నోరు మెదపని వారు,అటుతరువాత అంట కాగిన వారు నేడు రోడ్డెక్కి మాట్లాడటం, అందులో ఆనాడు అధికారం అనుభవించి , రాఘవ ను అస్వీరధించడం తో పాటు,అండ గా నిలిచిన వారు.ఇప్పుడు రోడ్డెక్కడం అచ్చర్యం గా ఉంది. రామకృష్ణ కుటుంబం పై సానుభూతి న,రాజకీయ లబ్ధిన ఆలోచించాలి. రాఘవ ఇంటి సమీపం లో ఒక రాజకీయ వేత్త కుటుంబీకులు కు 8 ఎకరాలు భూమి ఆనాడే ఎలా వచ్చినది నోరు మెదపరు..అకృత్యాలు కు,అక్రమలకు తెరలేపడానికి రాక్షలు లాంటి వారు తయారు అయింది ఇప్పుడు కాదు,ఆనాడు అవసరాల. కోసం పూల దండలు వేసి ఇప్పుడు రాళ్లు తో యుద్ధం అంటే ఆలోచించాలి.నాడు తయారయిన రాక్షసులు నేడు బ్రహ్మరాక్ష సులుగా తయారయ్యి, రామకృష్ణ కుటుంబం(ఆయన సూసైడ్ నోట్ ఆధారంగ) ఆత్మహత్య కు కారణం అయ్యారు.అసలు విషయాలు దాచిపెట్టి అడ్డగోలు గా రోడ్డెక్కి మాట్లాడటం మాను కోవాలి.రాజకీయాలునుండి రౌడిఇజం లు వేరు కావాలి.రాజకీయ ప్రయోజనాల కోసం రౌడీలు ను తయారు చేసి వారిని జనం పైకి ఉసిగొల్పి న వారెవరు అన్నది అందరూ ఆలోచించాలి.ఇక్కడ పోలీస్ ని,అధికార పార్టీ వారిని అభినందించాలి..పోలీస్ గతప్రభుత్వ కాలం లో చెయ్యని విధంగా కేసు పెట్టారు.అధికార పార్టీ సస్పెండూ చేస్తున్నట్లు తెలిపింది. ఎమ్యెల్యే వనమా రాఘవని. నియోజకవర్గం నుండి బహిష్కరిస్టన్న అన్నారు..కనీసం గత పాలకులు మేము తప్పు చేసాము ఆనాడే చర్యలు తీసుకోలేక పోయాము అని ఆత్మ విమర్శ చేసుకొంటారా చూడాలి .పైవి అన్ని నామాటలు,అభిప్రాయం లు ఉద్దేశాలు కావు .”జనం మాట”.
-సాహిత్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube