శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తులు రద్దీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 22, శ్రీశైలం:

జ్యోతిర్లింగక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కార్తీక మూడవ సోమవారం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రాగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.ప్రధాన ఆలయాల్లో భ్రమరాంబ మల్లికార్జునస్వామివారలతో పాటు పరివార దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. మూడవ కార్తీక సోమవారం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.వేలాది మంది భక్తులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు.

Ongoing crowd of devotees in Srisailam.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube