కొనసాగుతున్న రాజీనామాల పర్వం

కొనసాగుతున్న రాజీనామాల పర్వం

0
TMedia (Telugu News) :

కొనసాగుతున్న రాజీనామాల పర్వం

టీ మీడియా, డిసెంబర్ 5,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ, ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవడంతో.. ఇన్నాళ్లు కేసీఆర్ సర్కార్ లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇన్ని రోజులు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రభాకర్‌రావు తెలిపారు.ఇక మరోవైపు, సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికీ రిజైన్ చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌ శాంతికుమారికి పంపించారు. అలాగే, కాగా, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు సైతం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.

Also Read : దళిత బంధు దళారీలకు బిగిస్తున్న ఉచ్చు

రాజీనామా లేఖలు పంపి వారు వీరే.. కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జూలూరు గౌరీశంకర్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా.ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తో పాటు మరికొందరు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube