ఉల్లి ఎంతో మేలు..
లహరి, ఫిబ్రవరి 28, ఆరోగ్యం : ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు న్నాయని చాలామందికి తెలుసు. అవేంటో ఒకసారి పరిశీలించండి. ఉల్లిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు, జ్వరంతో పోరాడటానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఉల్లిపాయలు సహాయపడతాయి. ఉల్లిపాయల్లోనే కాదు.. ఉల్లి కాడల్లో కూడా ఔషధగుణాలు మెండు.ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.ఉల్లిపాయ కాడల్లో ఉండే ఫోలేట్స్ గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. అలాగే కెమోఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా రక్త ప్రవాహాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.తక్కువ క్యాలరీలు, కొవ్వు పదార్థాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను రోజూ తినేవారికి అధిక బరువు సమస్యలుండవు.
ఉల్లిపాయల్లో ఉండే జియాంథిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది.ఉల్లిపాయలు చర్మాన్ని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తాయి.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో వీటిని తరచుగా తినడం వల్ల కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది.
Also Read : తండాల్లో కంటి వెలుగు కార్యక్రమం
ఉల్లిపాయలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ ఉండే అధిక కొవ్వును తగ్గిస్తుంది.ఇందులో అధిక మోతాదులో ఉండే సల్ఫర్‌అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ కె కూడా ఉన్నాయి.ఇంకా కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్, ఫైబర్ కూడా ఉన్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube