ఆన్‌లైన్‌ లోన్ల పేరిట నకిలీ యాప్‌లు

137 నకిలీ యాప్‌ల జాబితా విడుదల

1
TMedia (Telugu News) :

ఆన్‌లైన్‌ లోన్ల పేరిట నకిలీ యాప్‌లు
137 నకిలీ యాప్‌ల జాబితా విడుదల
టీ మీడియా,మే 6,హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ రుణయాప్‌లు.. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత అడ్డగోలు వడ్డీల దోపిడీతో వంచన చేస్తున్నాయి. కిస్తీ కట్టడం ఏ మాత్రం ఆలస్యం అయినా మానసిక వేధింపులకు దిగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. సందట్లో సడేమియా అన్నట్టు కొన్ని నకిలీ ఆన్‌లైన్‌ లోన్‌యాప్స్‌ పుట్టుకొస్తున్నాయి. మన ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లు, ఫొటోలు, ఇతర వివరాలు చోరీ చేసి మనకు తెలిసిన వాళ్లకు తప్పుడు సందేశాలు పంపుతూ మానసికంగా హింసిస్తున్నాయి. ఇలాంటి యాప్‌లపై ఆర్బీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా దేశంలో చెలామణి అవుతున్న యాప్‌ల జాబితాను విడుదల చేసింది. మొత్తం 600 వరకు ఈ తరహా లోన్‌ యాప్‌లు ఉన్నట్టు గుర్తించినా, ప్రాథమికంగా 137 యాప్‌ల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇలాంటి యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రుణాలు అవసరమైతే ఆర్బీఐకి చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలేనా అన్నది పరిశీలించుకోవాలని వెల్లడించారు.

Also Read : రాహుల్‌కు ములాఖత్‌కు అనుమతి నిరాకరణ

ఆర్బీఐ గుర్తించిన ఫేక్‌ లోన్‌ యాప్‌లు
యూపీఏ లోన్‌, గోల్డ్‌ మ్యాన్‌ పే బ్యాక్‌, హ్యాండీ లోన్‌, రుపీ కింగ్‌, ఎంఐ రుపీ, వన్‌ లోన్‌ క్యాష్‌ ఎనీ టైం, ఎక్స్‌ప్రెస్‌ లోన్‌, లోన్‌ డ్రీమ్‌, రుపీ లోన్‌, ఫ్లాష్‌ లోన్‌ మొబైల్‌, రుపీ స్టార్‌, వావ్‌ రుపీ, క్యాష్‌ పార్క్‌ లోన్‌, హో క్యాష్‌, ఫస్ట్‌ క్యాష్‌, క్లియర్‌ లోన్‌, రుపీ బాక్స్‌, స్మాల్‌ లోన్‌, రిచ్‌, లోన్‌ గో, ఆసాన్‌ లోన్‌, లైవ్‌ క్యాష్‌, ఫాస్ట్‌ రుపీ, లోన్‌ ఫార్చ్యూన్‌, క్యాష్‌ ప్యాకెట్‌, ఇన్‌స్టా లోన్‌, అప్‌నా పైసా, కాయిన్‌ రుపీ, క్యాష్‌ అడ్వాన్స్‌, క్యాష్‌ పాపా, లోన్‌ క్యూబ్‌, హ్యాండ్‌ క్యాష్‌, లోన్‌ హోమ్‌ స్మాల్‌, ఐ క్రెడిట్‌, వెన్‌ క్రెడిట్‌, సమయ్‌ రుపీ, లెండ్‌ మాల్‌, సిల్వర్‌ ప్యాకెట్‌, భారత్‌ క్యాష్‌, మనీ మాస్టర్‌, ఈజీ లోన్‌, వార్న్‌ రుపీ, స్మార్ట్‌ కాయిన్‌, లక్కీ వ్యాలెట్‌, యూపీఓ లోన్‌, బడ్డీ లోన్‌, క్యాష్‌ మైన్‌, టైటో క్యాష్‌, మై క్యాష్‌ లోన్‌, సింపుల్‌ లోన్‌, క్యాష్‌ మిషన్‌ లోన్‌, ఫర్‌ పే, మినిట్‌ క్యాష్‌, ఫాస్ట్‌ పైసా, మోర్‌ క్యాష్‌, క్యాష్‌ బుక్‌, హ్యాండ్‌ క్యాష్‌ ఫ్రెండ్లీ లోన్‌, బెలోనో లోన్‌, కొకో లోన్‌, రిలయబుల్‌ రూపీ క్యాష్‌, ఎర్లీ క్రెడిట్‌ యాప్‌, ఈగిల్‌ క్యాష్‌లోన్‌ యాప్‌, క్యాష్‌ క్యారీ యాప్‌, క్యాష్‌ పార్క్‌, రిచ్‌ క్యాష్‌, ఫ్రెష్‌ లోన్‌, బెట్‌ విన్నర్‌ బెట్టింగ్‌, రుపీ మాల్‌, సన్‌ క్యాష్‌, మినిట్‌ క్యాష్‌, బస్‌ రుపీ, క్యాష్‌ లోన్‌, ఆన్‌స్ట్రీమ్‌, క్యాష్‌ లోన్‌, స్మాల్‌ లోన్‌, రుపీయా బస్‌, ఇన్‌స్టా మనీ, ైస్లెస్‌ పే, లోన్‌ క్యూబ్‌, ఐ కార్జా, మనీస్టాండ్‌ ప్రో, పోక్‌ మనీ, క్వాలిటీ క్యాష్‌, లోన్‌ లో జీ, ఫర్‌ పే యాప్‌, రుపీ ప్లస్‌, డ్రీమ్‌ లోన్‌, క్యాష్‌ స్టార్‌, మినీసో రుపీ, క్యాష్‌ పాల్‌, ఫార్చూన్‌ నౌ, క్రెడిట్‌ వ్యాలెట్‌, ప్యాకెట్‌ బ్యాంక్‌, లోన్‌ జోన్‌, ఫాస్ట్‌ కాయిన్‌, స్టార్‌ లోన్‌, ఈజీ క్రెడిట్‌, ఏటీడీ లోన్‌, ట్రీ లోన్‌, బ్యాలెన్స్‌ లోన్‌, క్యాష్‌ బౌల్‌, క్యాష్‌ కర్రీ, క్యాష్‌ మిషన్‌, క్యాష్‌ పాకెట్‌ లైవ్‌ క్యాష్‌, క్యాష్‌ కోలా, 66 క్యాష్‌, కోకో లోన్‌, లోన్‌ రిసోర్స్‌(డీసీ), క్యాష్‌ హోల్‌, ఈజీ బారో క్యాష్‌ లోన్‌, ఐఎన్‌డీ లోన్‌, వ్యాలెట్‌ పేఈ, క్యాష్‌ గురూ యాప్‌, గోల్డ్‌ క్యాష్‌, ఆరెంజ్‌ లోన్‌, యాంగిల్‌ లోన్‌, లోన్‌ సాతీ, షార్ప్‌ లోన్‌, డెయిలీ లోన్‌, స్కై లోన్‌, మో క్యాష్‌, జో క్యాష్‌, బెస్ట్‌ పైసా, హెలో రుపీ, హాలిడే మొబైల్‌ లోన్‌, ఫోన్‌ పే, ప్లంప్‌ వ్యాలెట్‌, క్యాష్‌ క్యారీ లోన్‌ యాప్‌, క్రేజీ క్యాష్‌, క్విక్‌ లోన్‌ యాప్‌, రాకెట్‌ లోన్‌, రుపీ మ్యాజిక్‌, రష్‌ లోన్‌, బెలోనో లోన్‌ యాప్‌, ఎగైల్‌ లోన్‌ యాప్‌, క్యాష్‌ అడ్వాన్స్‌ 1, ఇన్‌కమ్‌ ఓకే.

Also Read : సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube