వాన సెలవులోను ఆన్లైన్ చదువు

వాన సెలవులోను ఆన్లైన్ చదువు

1
TMedia (Telugu News) :

వాన సెలవులోను ఆన్లైన్ చదువు

టి మీడియా, జులై 13, వనపర్తి బ్యూరో : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఉపాధ్యాయులు విద్యార్థులు అల్పపీడన ప్రభావంతో, జడివానతో, ముసురు జల్లులతో అంతటా ఆగమాగం అవుతున్నా, మాదనపూరం అజ్జకొల్లు పాఠశాల విద్యార్థులు మాత్రం మొక్కవోని దీక్షతో తమ చదువును నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.కరోన కష్టకాలంలో, అందిపుచ్చుకున్న ఆన్లైన్ చదువు అనుభవంతో, అజ్జకొల్లు ఉపాధ్యాయులు విద్యార్థుల సిలబస్ ను దృష్టియoదుంచుకొని , ప్రత్యేకంగా కంప్యూటర్ పాఠాలు తయారుచేశారు.
వాటిని ఆయా తరగతి వాట్సప్ గ్రూపులలో పెట్టిన ఉపాధ్యాయులు, శ్రమ కోర్చి విద్యార్థులచే చదివించి,నోట్స్ రాయిస్తున్నారు. తద్వారా, విద్యార్థులు నిరంతరం బోధనాభ్యాసన కార్యక్రమంలో పాల్గొని,విషయపరిజ్ఞానం పెంచుకుంటున్నారు.

 

Also Read : అనంతసేనుడి అశ్లీల బాగోతం

 

ఉపాధ్యాయులు కూడా , ఆన్లైన్ ద్వారానే ,విద్యార్థుల కృషిని పర్యవేక్షిస్తున్నారు.
గత సంవత్సరంలాగానే, అజ్జకొల్లు విద్యార్థులు, పది పరీక్షలలో, మళ్ళీ 100 శాతం పాసై గురుదక్షణ సమర్పించుకుంటామని బుధవారం గురు పూర్ణిమ సందర్భంగా ప్రతినబూనారు. అజ్జకొల్లు గురువులు నిత్యం చేసే సరికొత్త ఆలోచనల తపస్సు కూడా పేద విద్యార్థుల జీవితాలలో ఉజ్వల ఉషస్సు నింపడానికే.ప్రభుత్వ పాఠశాలో చదువుతున్న అజ్జకొల్లు విద్యార్థుల నుదుటిపై చదువనే చైతన్య తిలకం దిద్ది,వారిని సరస్వతీ పుత్రులుగా మలిచి, గురువును మించిన శిష్యులు గా తయారు చేయాలన్నదే మా ధ్యేయం ,ఆశయం అని ప్రధానోపాధ్యాయులు అతీఖ్ అహ్మద్ అన్నారు. సెలవు రోజుల్లో కూడా తమ వృత్తి ధర్మాన్ని పాటించి విద్య ప్రమాణాలు పెంపు కోసం పాటుపడుతున్న ఉపాధ్యాయుల యొక్క కృషిని విద్య కమిటీ చైర్మన్ బోయరాజు కొనియాడారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube