ప్రభుత్వం తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 09: కొణిజర్ల

మండలం లో వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మడలం లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలంలో ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో వెంటనే ఏర్పాటు చెయ్యాలి అని కోరారు. రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలోని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . రైతులు వరి ధాన్యాన్ని కళ్ళల్లో ఆరబోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారని . వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వర్షం పడితే రైతులు దారుణంగా నష్టపోతారని కావున ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మండలంలో కనీసం పది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కొణిజర్ల మండలం లోని మల్లు పల్లి అన్నవరం రామనర్సయ్య నగర్ లో పర్యటించారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొంతు సమత , రైతు సంఘం నాయకులు కోయిని భద్రయ్య ,భూక్యా నరేష్ ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి కృష్ణ, అన్నరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Government should immediately open rice procurement centers.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube