జూపెడ గ్రామంలో ఐకెపి సెంటర్ ఓపెనింగ్
టీ మీడియా,నవంబర్ 26, తిరుమలాయపాలెం మండలం : తిరుమలయపాలెం మండలం జూపేడ గ్రామంలో సమ్మక్క మహిళా గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్ చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ఎంపీపీ మంగీలాల్ ఏవో, సీతారాం రెడ్డి , ఎంపీడీవో జయరాం, ఏపీవో నరసింహారావు, ఏపీఎం అలివేలు మంగ. సీసీ అనిత. వి వో ఏ . వసంత హాజరైనారు. ఎంపీపీ మంగీలాల్ , ఏవో సీతారాం రెడ్డి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి జూపేడ కాకరవాయి పైనంపల్లి సోలిపురం రాజారం బచ్చోడు గ్రామాల రైతులు ఇట్టి ఐకెపి సెంటర్ కి ధాన్యాన్ని తీసుకొని వచ్చి రైతులు అమ్ముకోవచ్చునని అన్నారు.
Also Read : కంటైనర్ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోహినమ్మ, మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ సైఫుద్దీన్, ఏఈఓ ప్రదీప్, ఎంపీటీసీ ఎల్ రజిత, సమ్మక్క గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు బి లింగమ్మ,సరిత రాజ్యమ్మ, గ్రామ రైతులు మల్లారెడ్డి, స్టాలిన్ రెడ్డి, పాల్గొని ఐకెపి ధాన్యం కొనుగోలు సెంటర్ పెట్టిన కారణంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.