కలెక్టరేట్ కేంద్రం గా కోవర్ట్ ల ఆపరేషన్

పిర్యాదు పత్రాలు మాఫియా చేతిలోకి

0
TMedia (Telugu News) :

కలెక్టరేట్ కేంద్రం గా కోవర్ట్ ల ఆపరేషన్

– పిర్యాదు పత్రాలు మాఫియా చేతిలోకి

– అక్రమ విక్రయాలకు సహకారం

– 5 ఏళ్ళ నుండి పెరిగిన వేగం

– 58,59 జీఓ లపై డేగ కళ్ళు

– సిలింగ్, అసైన్డ్, ఇరిగేషన్ భూములు హాంఫట్

టీ మీడియా, జనవరి 6, ఖమ్మం బ్యూరో : జిల్లాలో భూ కబ్జాలు, అక్రమ రిజిస్టేషన్ ల కోసం దందా రాయళ్ళు కలెక్టర్ కార్యాలయం కేంద్రం గా కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారనేది స్పష్టం అవుతోంది. వీరికి కలెక్టర్ కార్యాలయం లో ఎవరు సహకారం అందించిన వారు అన్నది తెలియాల్సి ఉంది. వేర్వేరు ఫిర్యాదు దారులు ఇచ్చిన మూడు సంబంధమైన ధరకాస్థులు ఒకటి అయితే వారికి కలెక్టర్ ఆఫీస్ నుండీ వచ్చిన సమాధానం పత్రం ఇంకొకటి కావడం కోవర్ట్ చర్యలకు నిదర్శనం గా ఉంది. ఈ మూడు క లెక్టర్ కార్యాలయం ఇన్వార్డ్ లో ఇచ్చిన ధరకాస్థులు కావడం గమనర్హం. మూడింటిలో ఒక ప్రాంత బిఆర్ఎస్ నేత ప్రభుత్వ భూమి అక్రమ విక్రయం పై చర్యలు కోరుతూ అధారాలతో కలెక్టర్ కి ఇచ్చిన ధరకాస్తులు ఉన్నాయి. అవి కూడా ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ల కు చెందిన ఎకరం 3 కోట్ల వరకు విలువ చేసే భూములు అనేది పరిశీలనలో వెల్లడి అయింది. వివరాలు పరిశీలిస్తే..

Also Read : కృతజ్ఞత సభకు ఆహ్వానించిన ఉద్యమకారులు.

ఖమ్మం నగరం సుందర్ టాకీస్ రోడ్డు (36 డివిజన్ ), ఇంటి నెంబర్ 2-3-228/1 అడ్రెస్ కలిగిన బిఆర్ఎస్ నేత గొనె మహేష్ రెడ్ది గత ప్రభుత్వ కాలంలో కలెక్టర్ కార్యాలయం ఇన్ వార్డ్ లో వెలుగుమట్ల-2 లో పేదలకు చెందిన ఇళ్ల స్టలాలు కొంతమంది అక్రమంగా విక్రయాలు చేస్తున్నారు. 36 వ డివిజన్ లో ఇళ్ళు లేని పెదలు ఉన్నారు. వీరికి ఇవ్వండి అన్నది ఫిర్యాదు సారాశం.

అధికారులు వింత సమాధానం :
మహేష్ రెడ్ది ఫిర్యాదు పత్రం జత చేసి కలెక్టర్ పేరున ఖమ్మం ఆర్డిఓ ని చర్యలు తీసుకొండి అంటూ ఆర్ సి నెం : ఈ2/86-238 ద్వారా లెటర్ పంపారు.అ లెటర్ లో వారు బి రాజేశ్వర రావు మరో ఆరుగురు ఫిర్యాదు చేసారని పేర్కొన్నారు. ఈ లెటర్ కాపీని కూడా సంతోష్ రెడ్ది అడ్రెస్ కాకుండ, పాలేరు నియోజకవర్గంలో సిలింగ్ భూములు ప్రైవైట్ భూములు గా మార్చిన విషయం పై ఫిర్యాదు చేసిన వ్యక్తి కి పంపారు. కలెక్టర్ కార్యాలయం వారు పంపిన లెటర్ లో పేర్కొన్న బి. రాజేశ్వర రావు, మరో ఆరుగురిది ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి రైతులుగా వెల్లడి అయింది. వాళ్ళు మద్దులపల్లి మార్కెట్ రోడ్ లోని కోట్లు విలువ చేసే ఇరిగేషన్ భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేసారు. సుమారు 150 కోట్లు విలువ చేసే ఈ భూకబ్జా పిర్యాదులు. ఇవి కలక్టర్ కార్యాలయం నుండి దంద రాయుళ్ళ చేతికి వెళ్లగా వారి సూచన మేరకు అధికారులు చర్యలు తీసుకున్నాము అని ఆన్లైన్ లో చూపడానికి ఈ విధంగా చేసారు అనేది తెలుస్తోంది. ప్రభుత్వం మారిన ఇంకా కోవర్ట్ ఆపరేషన్ నడుస్తు న్నట్లుగా సమాచారం..

Also Read : బ్రాహ్మణ పరిషత్ ఉమ్మడి మండల కార్యవర్గం ఏకగ్రీవం

డేగ కళ్ళు పడటం వల్లే :
రాష్ట్ర వ్యాపీత చర్చకు, క్రిమినల్ కేసుకు దారి తీసిన ఖమ్మం నగరబి ఆర్ ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీ విధ్య చౌదరి 59 జిఓ ద్వారా అక్రమ రిజిస్టేషన్ వ్యవహారంతో పాటు ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా నల్గొండ కేంద్రంలో అక్రమ రెగ్యులైజేష న్ వెనుక కబ్జా రాయుడు గా పేరున్న డేగ ఉన్నట్లుగా తెలిసింది. ఇతను కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరి కి దగ్గరి బంధువు గా కూడా తెలిసింది. గతం లో ఖమ్మం కాల్వడ్డు, సీక్వెల్ ప్రాంతల్లోని ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూములు పై వాలినట్లు ఆరోపణలు 10 ఏళ్ళ క్రితం ఉన్నాయి.. గత ప్రభుత్వంలోని ఒక మంత్రి కి సన్నిహితంగా మెలిగిన ఇతను ఖమ్మం నగరానికి వలస వచ్చాడు. అక్రమ దస్తావేజులు సృష్టి ఇతని ప్రత్యేకతగా పేరుంది. అధికారంలో ఉన్న పార్టీ వారి ప్రక్కన చేరడం ఇతని నైజం. ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో కొంతమంది గత అధికార పార్టీ వారి తో కల్సి “రియల్ ” ఆఫీస్ ల ముసుగులో భూ కబ్జా ఆఫీస్ లు తెరిచి ప్రవైట్ సైన్యం ద్వారా దందాలకు తేరలేపి కలెక్టర్ కార్యాలయం కేంద్రం గా కో వర్ట్ ఆపరేషన్ చేసున్నట్లు గా తెలిసింది (అసైన్డ్, సిలింగ్, ఇరిగేషన్ భూముల కబ్జాలపై పిర్యాదులు, కోవర్ట్ లు మరో కధనం లో.. )

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube