ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి ఉత్త‌ర్వులు జారీ

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి ఉత్త‌ర్వులు జారీ

0
TMedia (Telugu News) :

ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి ఉత్త‌ర్వులు జారీ

టీ మీడియా, అక్టోబర్ 13, హైద‌రాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. హైద‌రాబాద్ సీపీ మిన‌హా అన్ని పోస్టుల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యాన‌ల్ నుంచి అధికారుల‌ను ఈసీ ఎంపిక చేసింది. యాదాద్రి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌గా గౌతం, ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సునీల్ శ‌ర్మ‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌గా క్రిస్టినా నియామ‌కం అయ్యారు.

Also Read : చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యత

పోలీసు క‌మిష‌న‌ర్లు, ఎస్పీల జాబితా :
1. అంబ‌ర్ కిషోర్ ఝా – వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ 2. క‌ల్మేశ్వ‌ర్ సింగేనేవ‌ర్ – నిజామాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ 3. చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ 4. సింధూ శ‌ర్మ – కామారెడ్డి ఎస్పీ 5. సంప్రీత్ సింగ్ – జ‌గిత్యాల ఎస్పీ 6. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ 7. వైభ‌వ్ ర‌ఘునాథ్ – నాగ‌ర్‌క‌ర్నూల్ ఎస్పీ 8. రితిరాజ్ – జోగులాంబ గ‌ద్వాల్ ఎస్పీ 9. పాటిల్ సంగ్రామ్ సింగ్ గ‌ణ‌ప‌తి రావ్ – మ‌హ‌బూబాబాద్ ఎస్పీ 10. యోగేష్ గౌత‌మ్ – నారాయ‌ణ‌పేట ఎస్పీ 11. కిర‌ణ్ ప్ర‌భాక‌ర్ – భూపాల‌ప‌ల్లి ఎస్పీ 12. రాహుల్ హెగ్డే – సూర్యాపేట ఎస్పీ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube