చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసిన శ్రీకర్.

-అవయవాల ధానంతో కొందరికి ఊపిరి

2
TMedia (Telugu News) :

చనిపోతూ మరికొందరికి ప్రాణం పోసిన శ్రీకర్.

-అవయవాల ధానంతో కొందరికి ఊపిరి

టీ మీడియా,అక్టోబర్ 29,ముదిగొండ: మాజీ సర్పంచ్ ఉసికల సుధారాణి, కాంగ్రెస్ నాయకులు ఉసికల రమేష్ ల కుమారుడు శ్రీకర్ శుక్రవారము వెంకటాపురం గ్రామ వద్ద రోడ్డు ప్రమాదానికి గుర్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కొసం రాత్రి హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తుండగా శ్రీకర్ శరీరం వైద్యానికి స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. బ్రెయిన్ డెడ్ అయితే బతికే అవకాశం లేదని వైద్యులు వివరించారు. తమ కుమారుడి గుండెను తీస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా వారి గుండెను రాయి చేసుకుని హృదయాన్ని ఇతర అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

Also Read : ఉగ్ర వాధులను శిక్షించడంలో విఫలం

దీంతో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సాంకేతిక పద్ధతిలో గుండె, కిడ్నిలు, కళ్ళు, కాలేయం అవయవాలను సేకరించునున్నారు. తరువాత ఈ అవయవాలను అత్యవసర పరిస్థితుల్లో వారికి అమర్చనున్నారు. చనిపోతూ మరి కొంత మందికి జీవం పోసిన శ్రీకర్ సజీవంగానే ఉండనున్నాడు. కుమారుడు పోయిన పుట్టెడు కష్టంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రుల ధైర్యానికి ఎంత చెప్పినా తక్కువే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube