ఎస్టీ జాబితాలో వేరే కులాలను చేరిస్తే ఊరుకోం
– బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
టీ మీడియా, ఫిబ్రవరి 12, వనపర్తి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాకు మోసం చేయాలని చూడకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి గిరిజనులు కూడు గూడు గుడ్డ సరిగ్గా లేక బతుకులు సాగ దీస్తున్నాము.ఇతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపి మా బతుకులు ఆగం చేయొద్దు. నేటికీ గిరిజన గుడ్లలో, లంబాడి తండాలలో సరైన సదుపాయాలు లేక బాధలు పడుతున్నారు. ఇప్పటికీ సరైన రోడ్లు తాగు,సాగు నీరు లేక వలసలు పోతున్నాము.ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజనుల, సంక్షేమం అభివృద్ధి పట్ల దృష్టి సారించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనులను అభివృద్ధి చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం షెడ్యూల్ తెగల జాబితాలో ఇతర కులాలను చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడాన్ని బంజారాగిరిజన విద్యార్థి సమాఖ్య తీవ్రంగా ఖండిస్తుంది .నేటికీ తాండాలలో పసిపిల్లలను పోసించలేక పట్టణాలలో వలసలు, మురికివాడలో నివాసాలు సరియైన సదుపాయాలు లేక రోడ్డుపక్కనే తమ జీవితాలను బ్రతుకు జీవడా అని సాగదీస్తున్నారు.గిరిజనులను అభివృద్ధి చేయకుండా ఇతర కులాల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం ముమ్మాటికి లంబాడి గిరిజనులను మోసం చేయడం అవుతుంది .
Also Read : భద్రాచలం లో మనసున్న మారాజు
ఏజెన్సీ ఏరియాలలో నివసిస్తున్న గోండు, కోయ ,కోలం ,తోటి ప్రధాన్, కొండ్ల రేడ్లు , కొండా కాపులు నేటికీ అభివృద్ధికి ఆమాడా దూరంలో ఉంటూ వారి గుడాలకు సరియైన రహదారులు లేక విష జ్వరాలతో, పౌష్టికాహారలేమితో బాధపడుతుంటే వారికి కనీస సదుపాయాలైన రోడ్డు సదుపాయాలు,నివసించడాకి గృహాలు ,విద్య ,వైద్యం ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలు అమలు చేయాలని వారిని అభివృద్ధి పథంలో తీసుకురావాలి. ఎస్టీ జాబితాలోకి వేరే కులాలను చేరిస్తే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్ అంటూ బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ మండిపడ్డారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube