ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే మా లక్ష్యం
– ఏపికి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం
– సీఎం జగన్
టీ మీడియా, నవంబర్ 2, విశాఖపట్నం : నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం” అని సీఎం జగన్ పేర్కొన్నారు. గురువారం నుంచి విశాఖ వేదికగా వారం రోజుల పాటు సాగనున్న అంతర్జాతీయ సమావేశాలలో సుమారు 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజయ్యారు.
Also Read : మతతత్వం, మత మార్పిడి బిజెపి ఈ రెండే తెలుసు
ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు నిర్వాహకులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ,రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐసీఐడీ ప్రెసిడెంట్ డా. రగబ్ రగబ్, ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ కుష్విందర్ వోహ్రా, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ ధనుంజయ్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ హరి కిరణ్, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube