టీ మీడియా, డిసెంబర్13, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒవేన్ కేక్స్, బేకరీని సోమవారం శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్ఫా భువనేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఒవేన్ బేకరీని ప్రారంభించి బేకరీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బేకరీ యజమాని శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తమ బేకరీలో కూల్ కేక్‌లు, ప్రూట్ కేక్‌లు, బర్త్ డే కేక్‌లు, అన్ని రకాలు కేక్‌లు హోల్‌సేల్ ధరలకే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కుమారి బుడ్డారెడ్డి యశస్విని, వైసిపి గ్రామ నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి, గ్రామ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.