రైతు పండించిన వడ్లను ప్రభుత్వమే కొనాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వరావుపేట నవంబర్ 24

రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల్లోనే కొనాలి అని ప్రతీ వడ్ల గింజని కూడా ప్రభుత్వమే కొనాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.తెలంగాణ పీసీసీ ఆదేశానుసారం బుధవారం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి. అనంతరం తహసిల్దార్ కార్యాలయంకి ర్యాలీగా చేరుకొని తహసిల్దార్ చల్లా ప్రసాద్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వరి ధాన్యం పండించ వద్దని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదంగా ఉందని భూమి సారం పట్టి రైతులు పంటలు పండిస్తారని రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వమే అని అందుకనే మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు.

మీ మాయమాటలకు కాలం చెల్లిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొగల్లపు చెన్న కేశవరావు,జిల్లా పీసీసీ నాయకులు సున్నం నాగమణి,వగ్గేలా పూజిత,ఎంపీటీసీ లు వేముల భారతి,సత్యవరపు తిరుమల,వేముల ప్రతాప్,జల్లిపల్లి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

The Congress party has demanded that the government should buy every grain of paddy.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube