ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 22 వనపర్తి : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్లు ప్రాజెక్టు కావాల్సిన నల్లమట్టి, ఒండ్రు మట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అమరగిరి నుండి తరలించడం జరిగింది. ఆ రోజు మట్టిని ఇస్తే అమరగిరిలో ఒక గుడి మరియు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వారిని అడిగితే ఇప్పుడు అప్పుడు అని పబ్బం గడుపుతున్నారు. ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడం లేదు. గ్రామంలో గుడికట్టిన అందులో ఆంజనేయ స్వామి విగ్రహం లేదు దు అదేవిధంగా రహదారి లేక గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. హాస్పిటల్ గానీ పనుల మీద ఎక్కడికైనా వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. కావున స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్పందించి రోడ్డు వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

Palamuru- Rangareddy project the Nallamatti and alluvial soil shifted from Amaragiri to the Palamauru.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube