పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా మన గ్రామాలు: మంత్రి కేటీఆర్‌

పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా మన గ్రామాలు: మంత్రి కేటీఆర్‌

1
TMedia (Telugu News) :

పల్లె ప్రగతితో దేశానికే ఆదర్శంగా మన గ్రామాలు: మంత్రి కేటీఆర్‌
టి మీడియా,జూన్15, సిరిసిల్ల: రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని అన్నారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

Also Read : కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మణీయం : మంత్రి జగదీష్‌ రెడ్డి

ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటి సౌకర్యంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. వెంకట్రావుపల్లెలో విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
ఉపాధి కల్పనకు ప్రాధాన్యం
ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోపాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. నలుగురికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. దేశంలో 65 శాతం జనాభా 35 ఏండ్ల లోపువారేనని తెలిపారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్నివిధాల అండగా ఉంటామని చెప్పారు. ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నామని, ఎండా కాలంలోను చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు.

Also Read : కర్షకుల సేవలో వ్యవసాయ మార్కెట్ బేష్
ముస్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారుఅంతకుముందు మేడ్చల్‌లో కొత్తగా నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో మినీ స్టేడియాలు ఏర్పాటుచేస్తామన్నారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రానించాలని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube