టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 30
నియోజకవర్గ కేంద్రం మైన అశ్వారావుపేట లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల నందు బుధవారం పామాయిల్ సాగు,గెలలు నరుకు విధానం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ అనురాధ మాట్లాడుతూ పామాయిల్ సాగు చాలా లాభదాయకం అని చాలా సులువుగా సాగు చేసుకోవచ్చు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి ఉపప్రణాళిక లో భాగంగా కూడా రైతులను ప్రోత్సహిస్తూ సబ్సిడీ పై మొక్కలు, డ్రిప్ ఎరువులు అందిస్తుందని ఈ ప్రాంతం పామాయిల్ సాగు కి అనుకూలంగా ఉందని అన్నారు.ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఐ వి శ్రీనివాస్ రెడ్డి,వెంకటేశ్వరరావు ఆయిల్ ఫెడ్ డివిజన్ మేనేజర్ ఉదయ్ కుమార్,పలువురు రైతులు పాల్గొన్నారు.
