కరపత్రం ఆవిష్కరణ

కరపత్రం ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

కరపత్రం ఆవిష్కరణ
టి మీడియా, ఎప్రిల్ 22,ఖమ్మం : ఈ నెల 26న మంగళవారం కెమిస్ట్రీ & డ్రగ్గిస్ట్ భవనం మయూరి సెంటర్ నందు జమిలి సాహిత్య సాంస్కృతిక వేదిక ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారని . దానికి సంబంధించిన కరపత్రాన్ని జమిలి రాష్ట్ర కన్వీనర్ ఎల్. వెంకన్న , సమన్వయ కర్త కే.వీ సాకీ , స్పర్శ సామాజిక అధ్యయన వేదిక స్పర్శ భాస్కర్ , సేవాలల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ , కొమ్ము రమేష్ , బి సందీప్ ల ఆధ్వర్యంలో స్పర్శ హాస్పిటల్ నందు ఆవిష్కరించారు . అలాగే ఈ సభను విజయవంతంగా చేయాలని కోరారు.

Also Read : వాతావరణం లో మార్పులు

అనంతరం వారు మాట్లాడుతూ నూతన సమాజ ఆవిష్కరణకు నిరంతరం కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగేందుక ఈ జమిలి సంస్థ నడుం బిగించిందని , నేటి సమాజం అనేక రుగ్మతలతో , కులము , మతము , మూఢనమ్మకాలతో రాజ్యం ఏలుతూ సమాజాన్ని తిరోగమనం వైపు నడిపిస్తుందని అన్నారు . ఈ అమాన నీయం సమాజం స్థానంలో నైతిక విలువలతో కూడిన ఒక సరికొత్త సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కవులు , రచయితలు , కళాకారులు , విద్యార్థులు , మేధావులు , సామాజిక కార్యకర్తలు మరియు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube