పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
టి మీడియా, మే 1,హైదరాబాద్ :తెలుగులో తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకరిగా నిలిచింది. నెర్కొండ పర్వాయి, విక్రమ్ వేధ లాంటి ప్రాజెక్టులతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ మరో ఆసక్తికర సినిమాతో రెడీ అవుతోంది. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది శ్రద్దాశ్రీనాథ్.మెట్రోపాలిటన్ సిటీల్లో కన్జర్వెన్సీ స్టాఫ్ (పరిరక్షణ సిబ్బంది) కథల నేపథ్యంలో తెరకెక్కుతున్నీ ఈ ప్రాజెక్టుకు టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోన్న పాన్ ఇండియాప్రాజెక్టు టైటిల్ ఫైనల్ చేశారు. సీనియర్ నటి రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
Also Read ; మృతుడి కుటుంబానికి మాజీ జడ్పీటీసీ అండ
ఇవాళ మేడే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. మల్టీలింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు. దీపక్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకు దీపక్ సినిమాటోగ్రాఫర్ కూడా. రమేశ్ తమిళమణి మ్యూజిక్ డైరెక్టర్. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ను అందించింది. త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్చూస్తుంటే శ్రద్దాశ్రీనాథ్, రోహిణి ఇద్దరూ కోర్టు రూంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మెట్రోపాలిటన్ నగరాల్లో మిస్సింగ్ కారిడార్ వెంట ఉన్న పరిరక్షణ కార్మికుల్లోని మునుపెన్నడూ చూడని కోణాన్ని చూడబోతున్నారంటూ ట్వీట్ చేసింది శ్రద్దాశ్రీనాథ్.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube