రేషన్ షాప్ ను మంజూరు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 22 వనపర్తి : పాన్గల్ మండలం బహదూర్ గూడెం గ్రామంలో కొత్త రేషన్ షాప్ మంజూరు చేయాలని పానగల్ మండల తాసిల్దార్ కి వినతిపత్రం అందజేసిన భారతీయ జనతాపార్టీ నాయకులు, బహదూర్ గూడెం గ్రామంలో దాదాపు 600 జనాభా ఉంది 200 దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మూడు కిలోమీటర్ల దూరం పానగల్ పోయి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తుంది. వృద్ధులు ఆడవాళ్లు కొన్ని కుటుంబాలు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అధికారులు స్పందించి త్వరగా రేషన్ షాప్ మంజూరు చేయాలని మండల బిజెపి పార్టీ తరఫున కోరారు.

మన నినాదం ఏదైతే ఉందో ప్రజల వద్దకే పరిపాలన సాగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులకు మన అందరి మీద ఉంది. కాబట్టి బహదూర్ ప్రజలు ఇబ్బందులు త్వరగా సమసిపోయే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బి రమేష్,మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ,ఆదిత్య రెడ్డి, రాఘవేందర్, చంద్రశేఖర్, అరుణ్, శివుడు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube