చెత్త ట్రాక్టర్ డ్రైవర్ గా పంచాయతీ సెక్రటరీ

-సిబ్బంది విధులకు ఎగనామం

2
TMedia (Telugu News) :

చెత్త ట్రాక్టర్ డ్రైవర్ గా పంచాయతీ సెక్రటరీ

-సిబ్బంది విధులకు ఎగనామం !

టీ మీడియా, ఆగస్టు 3,మంచిర్యాల :జిల్లా తాండూర్ మండలం లోని కిష్టంపెట గ్రామ పంచాయతీ సెక్రటరీ చంద్ర మొగిలి గ్రామ పంచాయతీ యోక్క ట్రాక్టర్ నడుపుతూ చెత్త సేకరించడం అభినందనీయమని పలువురు చర్చించుకుంటున్నారు. సిబ్బంది విధుల్లో రాజకీయ జోక్యం ఉండటంతో సిబ్బంది విధులకు సమయానికి హాజరు కాక పోవడం వారు వచ్చేది రానిది తెలుపక పోవడం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు చేరుకునే సెక్రటరీకి విసుకు చెంది ఎవరిని ఎమి అనలేక తానే ట్రాక్టర్ నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు.

 

 

Also Read : తలుపులు ప‌గుల‌గొట్టి.. క‌త్తుల‌తో బెదిరించి మ‌హిళ కిడ్నాప్

 

ఎది ఎమైనా పారిశుద్ధ్య కార్మికులు రాజకీయ నాయకుల అండ చూసుకుని పలు గ్రామ పంచాయతీ లలో చెత్త సేకరణ ,త్రాగు నీరు ,తదితర పనులలో అలసత్వం వహిస్తున్నారని పలువురు బాహటంగానే అంటున్నారు. మిడి మిడి జ్ఞానం తో రాజకీయ నాయకులు ఎ విషయంలో మద్దతు ఇవ్వాలి ఎ విషయాలలో ఇవ్వకూడదో కనీస అవగాహన లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఇక డ్రైనేజీలు సంగతి అంతేసంగతులు ,ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube