పార్థా ఛటర్జీని కేబినెట్‌ నుంచి తొలగించండి..

TMC నేత కునాల్‌ ఘోష్‌ డిమాండ్‌

1
TMedia (Telugu News) :

పార్థా ఛటర్జీని కేబినెట్‌ నుంచి తొలగించండి..

టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ డిమాండ్‌
టీ మీడియా, జూలై 28,కోల్‌కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటం, మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేయడం పశ్చిమ బెంగాల్‌లో కలకలం సృష్టిస్తున్నది. పార్థాను ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగించడంపై సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అతనని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలనే వాదన వస్తున్నది.

 

Also Read : ఒక్క క్లిక్‌తో వీధి వీక్షణం

పార్థా ఛటర్జీని క్యాబినెట్‌ నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే బర్తరఫ్‌ చేయాలని టీఎంసీ జనరల్‌ సెక్రెటరీ కునాల్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. తన స్టేట్‌మెంట్‌ను తప్పుగా భావిస్తే తనను అన్ని పదవులను తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్‌ ఘోష్‌ ట్వీట్‌ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube