అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పిస్తాం:రేంజర్ రెహమాన్

అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పిస్తాం:రేంజర్ రెహమాన్

1
TMedia (Telugu News) :

అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పిస్తాం:రేంజర్ రెహమాన్

టీ మీడియా ,మార్చి ,10 అశ్వరావుపేట :నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదిక భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అటవీశాఖ అధికారి రెహమాన్ మాట్లాడుతూ అటవీ అభివృద్ధి లో గిరిజనులను భాగస్వామ్యం కల్పిస్తామని, స్థానిక అవసరాలకు సరిపడా అటవీ సంపద వినియోగం అయిన తర్వాతే రైతువేదిక ల్లో ఆన్లైన్లో అమ్మకాలు చేపడతామని ముఖ్యంగా అనంతరం,తిరుమల కుంట, నారాయణపురం గ్రామాలలో రైతు వేదిక యందు చింతపండు, కుంకుడు కాయలు అటవీ శాఖ ద్వారా ఈ అమ్మకాలు కొనసాగిస్తామని, దళారీ వ్యవస్థను అరికట్టడం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, అటవీ సంపదను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ముఖ్యంగా గిరిజనులు అడవి తల్లిని కాపాడుకోవాలని వారికి అటవీశాఖ అధికారులు ఎప్పుడూ కూడా మీ కుటుంబ సభ్యులు లాగా మీతో కలిసి ఉంటామని ఎటువంటి సమాచారం అయిన అన్ని వేళలా పనిచేసే మా ల్యాండ్ లైన్ నెంబర్ 08740 293977 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సమాచారం తెలిసిన వారి పేర్లు చాలా గోప్యంగా ఉంచుతామని తదుపరి దానికి సంబంధించిన పూర్తి పూర్వ ఫలాలు సమాచారం ఇచ్చిన వారికి తెలియ పరుస్తాను ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రమేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read : కొలువుల జాతర పై పార్టీ శ్రేణుల సంబరాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube